అనారోగ్య సమస్యల కారణంగా ఏడాది పాటు సినిమాలకు విరామం తీసుకున్న సమయంలో నటనకు పూర్తిగా దూరం కావాలని భావించినట్లు సమంత వెల్లడించింది. ఆరోగ్యంపై దృష్టి పెట్టడంతో పాటు తనకు నచ్చిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఇతర రంగాల్లో కొనసాగాలని అనుకున్నట్లు తెలిపింది.
అయితే భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు తనపై ఉంచిన నమ్మకం మళ్లీ నటన వైపు అడుగులు వేయడానికి ధైర్యాన్నిచ్చిందని సమంత చెప్పింది. ‘సిటాడెల్’ తర్వాత ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని నిర్మించాలని తొలుత భావించినప్పటికీ, కథపై నమ్మకంతో తానే నటించినట్లు వివరించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో సినిమాల్లో మళ్లీ చురుగ్గా కొనసాగుతున్నట్లు తెలిపింది.

