
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బీడీ కార్మికుల పెన్షన్‌కు ఉన్న కటాఫ్ డేట్‌ను తొలగించి, అర్హులైన ప్రతి కార్మికుడికి చేయూత పెన్షన్ అందించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ ఆధ్వర్యంలో అంగడి బజార్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కటాఫ్ డేట్ కారణంగా వేలాది మంది బీడీ కార్మికులు పెన్షన్‌కు దూరమయ్యారని యూనియన్ నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

