
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ మార్కుఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసినా విద్యార్థులు, నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించి నియామకాలు చేపట్టాలని కోరారు. ధర్నాలో విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

