శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీతో పాటు పటాన్చెరు పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు ధర్మ పరిరక్షణకు, సత్యానికి ప్రతీక అని పేర్కొన్న ఆయన.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన జీవన విలువలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని అన్నారు. పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.

