కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో రామగుండం రీజియన్లోని సింగరేణి బొగ్గు గని వద్ద నిరసన చేపట్టారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కారుణ్య నియామకాలు కొనసాగించాలని, సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని కాపాడాలని నేతలు డిమాండ్ చేశారు.

