విశాఖపట్నంలో జరిగిన ఘటన నేపథ్యంలో మత్స్యకార కుటుంబాలకు అండగా నిలుస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. అలాగే ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన చిన్నా కుటుంబాన్ని కూడా పార్టీ తరఫున ఆదుకుంటామని, ఆ కుటుంబానికి కూడా రూ.7 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కే.కే. రాజు వెల్లడించారు.