విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై విమర్శలు చేశారు. మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చినట్లు చెప్పినా, భారీ ఫ్లెక్సీలతో బలప్రదర్శన చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులను నిర్లక్ష్యం చేసి, ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సాయం అందించామని తెలిపారు. మత్స్యకారుల ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి గల్లంతైన వారి కోసం శోధన చర్యలు చేపట్టిందన్నారు. పలాస బైక్ ప్రమాదం, ఆక్వా రంగం, ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు, అంబటి రాంబాబు వ్యవహారంపై కూడా వైసీపీపై విమర్శలు చేశారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన సమాధానం ఇస్తారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.