నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఉద్యాన & పట్టుపరిశ్రమ శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద వాల్గోట్, సిరికొండ గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ సాగు లాభాలు, ప్రభుత్వ సబ్సిడీలు, సాగు విధానం, నీటి నిర్వహణ, మార్కెటింగ్ సౌకర్యాలపై అధికారులు రైతులకు వివరించారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఆయిల్ పామ్ సాగును రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.