Screenshot
విశాఖపట్నంలో జీవీఎంసీ కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు జీవీఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి అభివృద్ధి, మౌలిక వసతుల పనులు పూర్తి చేసినప్పటికీ బకాయి బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు.
ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పాత బకాయి బిల్లులను తక్షణమే చెల్లించాలని, 01/01/2027 నాటి బిల్లులను ‘నిధి’ పోర్టల్‌లో నమోదు చేసి సాధారణ నిధుల నుంచి చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. స్థానిక చిన్న కాంట్రాక్టర్ల ఉపాధికి ఇబ్బందిగా మారుతున్న పెద్ద ప్యాకేజీ టెండర్ విధానాన్ని రద్దు చేసి, చిన్న ప్యాకేజీలుగా పనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే నిరసనలకు దిగుతామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

