Screenshot
విజయనగరం కలెక్టరేట్లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు. కలెక్టరేట్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తను, పిచ్చిమొక్కలను తొలగించి ప్రత్యేక వాహనాల ద్వారా చెత్తను తరలించారు.
జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజులో ఒక గంట సమయం కేటాయిస్తే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని అన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు నివాస ప్రాంతాలు, కాలనీల్లోనూ స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

