రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడతో పాటు వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
గ్యారేజీల్లో అధిక పనిభారం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు, బస్సుల నిర్వహణ, పని ఒత్తిడి తదితర అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేయాలని తెలిపారు.

