ఇందల్వాయి మండలంలో జరిగిన MRPS నూతన కమిటీ సమావేశంలో అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించనున్న MSF జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. MRPS ఇందల్వాయి మండల ఇన్చార్జ్ సంగెం కిష్టయ్య మాదిగ, సిరికొండ మండల ఇన్చార్జ్ మొట్టల దీపక్ మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సంగెం కిష్టయ్య మాదిగ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ పోరాటాలకు దిశానిర్దేశం చేసే మహాసభను విజయవంతం చేసేందుకు MRPS, MSP, MSF, అనుబంధ సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో MRPS కార్యకర్తలు వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ డ్రెస్ కోడ్ను పాటించాలని నిర్ణయించారు.

