నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోడిగేలా రాజు కుమార్ మాట్లాడుతూ అహింస, సత్యం, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిచెప్పిన మహాత్మా గాంధీ ఆశయాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు.
మహాత్మా గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గ్రామ పాలకవర్గ సభ్యులు, వార్డు మెంబర్లు, మాజీ ఉప సర్పంచ్, వీఐడీసీ చైర్మన్ రమేష్, కార్యదర్శి కిషన్, కారోబార్, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

