Screenshot
పాయకరావుపేట పట్టణంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం సాయంత్రం వాకింగ్ చేస్తూ స్థానిక ప్రజలను కలుసుకున్నారు. గౌతమ్ థియేటర్ నుంచి వాకింగ్ ప్రారంభించిన ఆమె మార్గమధ్యంలో ప్రజలను పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లక్కీ షాపింగ్ మాల్ వద్ద మహిళా ఉద్యోగులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు.
అనంతరం తుని వైపు వెళ్తున్న స్కూల్ బస్సులోని విద్యార్థులతో మంత్రి అనిత ముచ్చటించారు. టీ షాప్ వద్ద నాయకులతో కలిసి టీ తాగడంతో పాటు స్థానికులతో మాట్లాడారు. చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని కలిసి వ్యాపారం ఎలా సాగుతోందో, స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.

