ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని నవజాత శిశువుల వార్డులో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆస్పత్రిని సందర్శించారు. అగ్ని ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలను ఆయన పరిశీలించారు.
నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అగ్ని ప్రమాదం అనంతరం ఆస్పత్రిలో చేపట్టిన చర్యలను కూడా ఆయన పరిశీలించారు.

