మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని గోదావరి ఘాట్‌ను మంగళవారం సబ్ కలెక్టర్ చంద్రయ్య సందర్శించారు. గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిమజ్జన సమయంలో గజ ఈతగాళ్లు, మత్స్యకారులను అందుబాటులో ఉంచాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఎస్సై సురేష్, మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి, 13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ, 7వ వార్డు కౌన్సిలర్ బోడ రాజేంద్రప్రసాద్, ఇతర కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.

