నిజామాబాద్ 24వ డివిజన్లోని చింతచెట్టు మైసమ్మ వద్ద శీతలమాత కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ గణపతి హోమం విఘ్నాలు తొలగిపోవడానికి, కార్యసిద్ధి, ఆరోగ్యం, సకల ఐశ్వర్యాల ప్రాప్తికి నిర్వహించే పవిత్రమైన వైదిక కార్యక్రమమని తెలిపారు. వినాయక ఉత్సవాలు, యజ్ఞాలు ప్రతి ఏటా ఐక్యతతో జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించిన నిర్వాహకులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

