మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అన్నప్రసాద కార్యక్రమంతో పాటు రాత్రివేళ అల్పాహార కార్యక్రమాలను నిర్వహించారు.
ఉత్సవాల్లో సంఘ సభ్యులు, మహిళలు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళల ఆధ్వర్యంలో 108 రకాల ఆహార పదార్థాలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్, శ్రీరాముల వెంకటేష్, రామచంద్రం, సత్యం, వెంకటేష్‌తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

