మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ తెలిపారు. మంగళవారం పొనకల్ వాగు వద్ద నిమజ్జనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దారి వెంబడి మొరం పోయించి ఏర్పాట్లు చేశారు.
నిమజ్జన ప్రాంతంలో వీధి దీపాలను ఏర్పాటు చేయించినట్లు సర్పంచ్ తెలిపారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని పొనకల్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఈవో రాహుల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మంద రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

