మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న గుంతను గుర్తించి, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యగా పూడ్చివేశారు. పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ఆధ్వర్యంలో గుంతలో మొరం పోసి పూడ్చివేత పనులు చేపట్టారు.
రోడ్డు పక్కన ఉన్న గుంత విషయాన్ని కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ మంద రాజేష్ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో అక్కడ నిమజ్జన పనులు జరుగుతుండడంతో సర్పంచ్ స్పందించి సంబంధిత సిబ్బందితో గుంతను పూడ్చివేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఈవో రాహుల్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ మంద రాజేష్ పాల్గొన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ముందస్తు చర్యలు చేపట్టినట్లు గ్రామ పంచాయతీ సిబ్బంది తెలిపారు.

