ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఎస్ఎన్సీయూ వార్డులో షార్ట్ సర్క్యూట్ ఘటన చోటుచేసుకుంది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా పొగలు కమ్ముకున్నట్లు సమాచారం. ఎస్ఎన్సీయూ యూనిట్లోని ఏసీ పేలడంతో నవజాత శిశువుల వార్డులో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.
ఘటన సమయంలో రెండు గదుల్లో కలిపి మొత్తం 23 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఘటనలో పలువురికి అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

