కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గణేశుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులకు ఆశీస్సులు అందించారు.
మండలి సభ్యులు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. గణేశునికి నిర్వహిస్తున్న యజ్ఞాలు, హోమాలు, అభిషేకాలతో మండపం పరిసరాలు భక్తిమయంగా మారాయి. కార్యక్రమంలో కౌన్సిలర్ అబ్దుల్ ఖలేఖ్, సూరి, మహమ్మద్ గౌస్, సీనియర్ కార్యకర్తలు, గణేష్ భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

