నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నారాయణపల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులు, గ్రామస్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.

