తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇస్నాపూర్ పురపాలక సంఘం కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం, సహకారంతో స్థానిక అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. వెంకట కిషన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

