విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా లైవిన్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్కూబా డైవింగ్ కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నం స్కూబా డైవర్లు సముద్ర గర్భంలో డైవింగ్ చేస్తూ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సాహస క్రీడలు, వాటర్ స్పోర్ట్స్‌తో పాటు సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు. లైవిన్ అడ్వెంచర్స్ వ్యవస్థాపకులు బి. బలరామ్ నాయుడు ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, దేశ సేవలో మరింత విజయాన్ని ఆకాంక్షించారు.

