బెల్లంపల్లి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శ్రీ భగవాన్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విశ్వకర్మ పతాకాన్ని అధ్యక్షులు అక్కెనపెల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం విశ్వకర్మ కులస్తులు జై విశ్వకర్మ నినాదాలతో ఆలయం నుంచి తిలక్ స్టేడియం, కాంటా చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఏడుగురు దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు చెన్నోజు గణేష్ ఆచార్యులు విశ్వకర్మ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేశ్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ఉత్సవ కమిటీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

