పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రసిద్ధ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అమ్మవారి కృపతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

