నిజామాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని అమ్మేచూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో బసవ గార్డెన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. టైక్వాండో క్రీడాకారులు, కోచ్లు, తల్లిదండ్రులు దీపాలు వెలిగించి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేసీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో దేశ సేవలో మరింత శక్తి, ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, సేవా భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో టైక్వాండో క్రీడాకారులు, కోచ్లు, తల్లిదండ్రులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

