యాపిల్ భారత యూజర్ల కోసం కీలక మార్పులను ప్రకటించింది. ఇకపై భారత్‌లో ఐక్లౌడ్+ సబ్స్క్రైబర్లకు అదనపు రుసుము లేకుండా Apple TV+ మరియు Apple Arcade సేవలను అందించనుంది. నెలకు రూ.75తో ప్రారంభమయ్యే 50GB iCloud+ ప్లాన్‌లోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. Apple TV+లో ఒరిజినల్ సినిమాలు, సిరీస్‌లు, Apple Arcadeలో 200కు పైగా గేమ్స్‌ను యాడ్స్, అదనపు కొనుగోళ్లు లేకుండా యాక్సెస్ చేయవచ్చు.
ఇకపై భారత్‌లో Apple TV+ మరియు Apple Arcade సేవలను విడిగా సబ్‌స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉండదు. ఇప్పటికే విడిగా సబ్‌స్క్రైబ్ చేసుకున్న యూజర్లను వారి iCloud+ ప్లాన్‌కు మార్చనున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త Apple One సబ్స్క్రిప్షన్లు కూడా భారత్‌లో అందుబాటులో ఉండవు. మరోవైపు iOS 27, iPadOS 27, macOS 27, watchOS 27, tvOS 27 అప్డేట్లను యాపిల్ విడుదల చేసింది. వీటిలో Siri AI, కొత్త పేరెంటల్ కంట్రోల్స్, మెరుగైన Screen Time ఫీచర్లు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.
ఈ కొత్త iCloud+ ప్యాకేజీని భారత్‌తో పాటు దాదాపు 100 దేశాల్లో ఈ నెల చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు యాపిల్ వెల్లడించింది.

