హైదరాబాద్ తార్నాకలో వినాయక చవితి సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు.
రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున సహజ మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఉపయోగించాలని శ్రీలత శోభన్ రెడ్డి ప్రజలకు సూచించారు. పర్యావరణాన్ని కాపాడుతూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు.

