మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ నాయకుడు నెల్లి రమేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపణలకు సంబంధించిన విషయాలను ఆయన వివరించారు.
గతంలో బూసి రాజు ఇంటి నిర్మాణానికి సంబంధించిన విషయాలపై తాపీ మేస్త్రి రమణతో కలిసి తన ఇంటికి వచ్చారని, ఆ సందర్భంలో ఇంటి నిర్మాణం గురించి మాత్రమే వారితో మాట్లాడినట్లు రమేష్ తెలిపారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తన రాజకీయ జీవితానికి మచ్చ తెచ్చేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

