
ఉస్మానియా యూనివర్సిటీలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద జరిగిన నిరసనను ఖండిస్తూ బీఆర్ఎస్వీ, దళిత ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దళితులు, మాదిగల అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని విద్యార్థి నాయకులు కొంపల్లి నరేష్, గణేష్ మాదిగ అన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద చావు డప్పులతో నిర్వహించిన నిరసనను ఖండిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

