మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. తప్పులను కప్పిపుచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసత్యాలు ప్రచారం చేశారని విమర్శించారు.
ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే వ్యక్తి లేదా సంస్థకు అప్పగించడంపై జగన్ ప్రశ్నలు లేవనెత్తారు. స్పోర్ట్స్ కోటా నిబంధనల మార్పులు, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కేటాయింపు వంటి అంశాలపై కూడా ఆరోపణలు చేశారు. మెగా డీఎస్సీ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను త్వరలో ప్రజల ముందుంచుతామని జగన్ తెలిపారు.

