బెల్లంపల్లి పట్టణంలో 76 జీవోను పునరుద్ధరించి పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాలను ప్రజలకు అందించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి, అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 7,000 మంది ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా, 5,000 పట్టాలు పంపిణీ చేసినట్లు చిన్నయ్య తెలిపారు. మిగిలిన పట్టాలను కూడా అందించి పట్టణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు.

