మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్పంచ్ కుర్సెంగ కళావతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి, డీఈ అచ్యుత్, పంచాయతీ కార్యదర్శి స్వరూప, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

