మిస్ యూనివర్స్ ఇండియా 2026 ఫైనలిస్ట్ ఉమంగ కుమావత్ తన కార్పొరేట్ కెరీర్‌ను కొనసాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆగస్టు 23న జైపూర్‌లో జరిగిన పోటీల్లో మధ్యప్రదేశ్ తరఫున పాల్గొని టాప్ 20లో నిలిచిన ఆమె, పోటీలు ముగిసిన కొద్ది వారాలకే బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో క్లౌడ్ ఇంజనీర్‌గా తన ఉద్యోగ బాధ్యతల్లో చేరారు.
సెప్టెంబర్ 14న ఉమంగ తన కార్యాలయ దినచర్యను చూపిస్తూ ‘ఏ డే ఇన్ మై లైఫ్’ పేరుతో వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. జిమ్‌లో వర్కౌట్, ఆఫీస్ పని, లంచ్, కాఫీ బ్రేక్ వంటి తన రోజువారీ కార్యకలాపాలను అందులో చూపించారు. గ్లామర్ రంగంలో అవకాశాలు ఉన్నప్పటికీ టెక్ కెరీర్‌ను కొనసాగిస్తున్న ఆమె నిర్ణయంపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

