మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంచార్జీ జూనియర్ సివిల్ జడ్జి బి. కృష్ణ తేజ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. చిన్నచిన్న కేసుల్లో ఇరుక్కుని పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగకుండా కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.
లోక్ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని, రాజీ మార్గం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉందని జడ్జి తెలిపారు. లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించిన పోలీసులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

