మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తిలో అరుదైన బ్రహ్మకమలం పుష్పం విరబూసింది. లావణ్య-రమేష్ దంపతుల ఇంటి ఆవరణలోని పూల కుండీలో ఈ అరుదైన పుష్పం వికసించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
బ్రహ్మకమలం సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుందని, హిందూ సంప్రదాయంలో దీనిని పవిత్రమైన పుష్పంగా భావిస్తారని దంపతులు తెలిపారు. పుష్పాన్ని దర్శించడం ద్వారా శుభం, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం ఉందన్నారు. తమ ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం వికసించడం అదృష్టంగా భావిస్తున్నామని లావణ్య-రమేష్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

