బేలా మండలం మకోడా ఎక్స్‌రోడ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ రహదారిపై కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన జోగు రామన్న.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

