-
నార్లాపూర్ హైవే వద్ద పట్టుకున్న పోలీసులు
-
25 బ్యాటరీలు, ఆటో స్వాధీనం.. నిందితులకు రిమాండ్
మందమర్రి, ఏప్రిల్ 28
: మందమర్రి సింగరేణి ఏరియా స్టోర్స్‌లో జరిగిన బ్యాటరీల దొంగతనం కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే చేధించారు. దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 25 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు మందమర్రి సీఐ వెల్లడించారు.
తనిఖీల్లో దొరికిన దొంగలు
మందమర్రి సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 25న ఏరియా స్టోర్స్‌లో బ్యాటరీలు మాయమైనట్లు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మందమర్రి ఎస్ఐ జి. నరేష్ తన సిబ్బందితో కలిసి నార్లాపూర్ గ్రామ సమీపంలోని హైవేపై వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఒక ఆటో పోలీసులను చూసి తప్పించుకునేందుకు వెనక్కి తిరగడంతో అనుమానం వచ్చిన పోలీసులు దానిని వెంబడించి అడ్డుకున్నారు.
అర్ధరాత్రి దొంగతనం..
ఆటోను తనిఖీ చేయగా అందులో దొంగిలించిన 25 బ్యాటరీలు లభ్యమయ్యాయి. ఆటోలో ఉన్న ముగ్గురు యువకులను విచారించగా, ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి సమయంలో తామే ఏరియా స్టోర్స్‌లోకి చొరబడి బ్యాటరీలను దొంగిలించినట్లు నేరాన్ని అంగీకరించారు.
అరెస్టయిన నిందితుల వివరాలు:
-
ధనకుంట్ల మునియప్ప (19) – రామన్ కాలనీ, మందమర్రి
-
జన్నే నరేంద్ర (19) – యాపల్, మందమర్రి
-
గాజుల శివప్రసాద్ (20) – ఇంద్రానగర్, మందమర్రి
నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
సిబ్బందికి అభినందనలు
తక్కువ సమయంలోనే కేసును ఛేదించి దొంగలను పట్టుకున్న ఎస్ఐ జి. నరేష్‌తో పాటు సిబ్బంది రాకేష్, మహేష్, కృష్ణ, శ్రీనివాస్‌లను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆస్తుల దొంగతనానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.




