-
నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పరీక్షలు
-
ఉచితంగా మందుల పంపిణీ
ధర్పల్లి, ఏప్రిల్ 26 : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం నవజాతి శిశువులు మరియు పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని
ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ శిబిరం జరిగింది.
వైద్య పరీక్షలు – జాగ్రత్తలు
గ్రామ సర్పంచ్ మల్లారం సుజాత శేఖర్, ఉప సర్పంచ్ సౌజన్య అశోక్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నిహారిక (MD Pediatrics) పాల్గొని చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ ప్రతినిధులు పాల్గొన్నారు.




