- గేమర్లు, యువత కోసం జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
- రూ.459 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, 61 జీబీ డేటా
- మూడు నెలల పాటు హాట్‌స్టార్, స్నాప్‌చాట్+ సబ్స్క్రిప్షన్ ఉచితం
- 18 నెలల పాటు ఉచితంగా గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్
ఈ ప్లాన్ వివరాల్లోకి వెళితే, రూ.459 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో వినియోగదారులకు మొత్తం 61 జీబీ హైస్పీడ్ డేటా అందుబాటులో ఉంటుంది. ఇందులో రోజుకు 2 జీబీ చొప్పున 56 జీబీ డేటాతో పాటు, అదనంగా మరో 5 జీబీ డేటా కూడా అందిస్తారు. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి.
ఈ ప్లాన్ ద్వారా జియో గేమ్స్, క్లౌడ్ గేమింగ్ యాక్సెస్‌ను మై జియో యాప్‌లో పొందవచ్చు. వీటితో పాటు మూడు నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, స్నాప్‌చాట్+ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తాయి. ముఖ్యంగా, సుమారు రూ.35,100 విలువైన గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తుండటం ఈ ప్లాన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
గేమింగ్, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలను ఒకేచోట అందించడం ద్వారా యువత సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని జియో భావిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు మై జియో యాప్ లేదా జియో అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు.




