- తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో ‘గాయపడ్డ సింహం’
- ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న హీరో దుల్కర్ సల్మాన్
- మే 1న సినిమా థియేటర్లలో విడుదల కానుంది
తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలలో నటిస్తున్న కొత్త చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు (శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
హైదరాబాద్ అమీర్‌పేటలోని ఏఏఏ సినిమాస్‌లో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ‘డోంట్ లాఫ్! ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్!’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రానికి కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, పవన్ సాదినేని సమర్పిస్తున్నారు. కళ్యాణ చక్రవర్తి మంతెన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
చిత్రబృందం వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సినిమాను మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.




