శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించిన అనంతరం తలెత్తిన చిన్న వివాదం ఘర్షణకు దారితీసి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 5న ఒప్పంగి సమీపంలోని ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద ప్రారంభమైన వాగ్వాదం అనంతరం మృతుడు సిమ్మ మోహన్రావు (42)పై నిందితులు దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో నీలం నీలప్పడు, రేయిపల్లి ప్రవీణ్లను అక్టోబర్ 7న అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సీహెచ్ ధనుంజయ నాయుడు తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి అభినందించారు.
