శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 16 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ ఎం. ముకుందరావు అరెస్టు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. చిన్నానాయుడు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, Hero HF Deluxe ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల దర్యాప్తులో నిందితులు ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు వెల్లడైంది. వ్యక్తిగత ఖర్చుల కోసం డబ్బు అవసరమైన సునీల్ కుమార్ను గంజాయి తరలింపునకు అమిత్ సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. బరంపురం నుంచి ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు గంజాయి ఉన్న సూట్కేస్, లగేజీ బ్యాగులతో వస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
