మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులు జంతువుల మాస్కులు ధరించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. MPPS తాళ్లపేట విద్యార్థులు గురువారం ఉత్సాహంగా పాల్గొని వన్యప్రాణుల సంరక్షణ, అడవుల ప్రాముఖ్యతపై ప్రజలకు సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. వికాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
అడవులు, వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎఫ్ఆర్ఓ వికాస్ తెలిపారు. వన్యప్రాణులను రక్షించడం, అడవులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని విద్యార్థులకు వివరించారు. చిన్ననాటి నుంచే ప్రకృతి పట్ల బాధ్యతను పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
