హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బహుజన బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గాయని, ఉద్యమకారిణి విమలక్క ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ వేడుకలను నిర్వహించడం 16వ సారి అని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో తీవ్రమవుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని, నీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అమెరికా, ఇజ్రాయెల్ సామ్రాజ్యవాద శక్తులు ఇరాన్ తదితర దేశాలపై సాగిస్తున్న యుద్ధాలను ఖండించాలని విమలక్క అన్నారు. యుద్ధాల వల్ల ఏర్పడుతున్న ఆర్థిక, సామాజిక సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ప్రజలు ఐక్యంగా పోరాడాలని సూచించారు. బహుజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని, అక్టోబర్ 18 వరకు జరిగే బహుజన బతుకమ్మ వేడుకల్లో అందరూ పాల్గొనాలని కోరారు.
