వికారాబాద్ జిల్లా పరిగి మండల టీయూడబ్ల్యూజే హెచ్-143 నూతన కమిటీ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండల అధ్యక్షుడిగా పి. సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా నర్సింలు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఖైసర్, రాఘవేందర్తో పాటు పలువురు వివిధ బాధ్యతలను చేపట్టారు.
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని నూతన కమిటీ అధ్యక్షుడు సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నర్సింలు తెలిపారు. జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
