అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ తండ్రి తన ఐదు నెలల పసిబిడ్డను హతమార్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం, దిగ్భ్రాంతి నెలకొంది.
స్థానికుల కథనం ప్రకారం.. చిన్నారి తల్లి జీవనోపాధి కోసం ఓ హోటల్లో పనికి వెళ్లిన సమయంలో బాబు తండ్రి గొల్లూరు చందు వద్దే ఉన్నాడు. ఆకలితో ఏడుస్తున్న చిన్నారిని హోటల్‌కు తీసుకెళ్లి తల్లి వద్ద పాలు పట్టించిన అనంతరం ఇంటికి తీసుకువచ్చాడు. కొద్దిసేపటికే గంజాయి మత్తులోకి వెళ్లిన చందు చిన్నారిపై దాడి చేసి హతమార్చినట్లు వారు పేర్కొన్నారు.
