బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని టీపీసీసీ నాయకుడు నాతరి స్వామి ఆరోపించారు. పార్టీకి కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా వలస వచ్చిన వారికి ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే వైఖరి కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.
తాను ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసి గడ్డం వినోద్‌కు మద్దతుగా పనిచేసి గెలిపించినప్పటికీ, తన పుట్టినరోజు వేడుకలకు నాయకులు, కార్యకర్తలు హాజరుకావద్దని హెచ్చరికలు జారీ చేయడం సరికాదని నాతరి స్వామి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికతకు ప్రాధాన్యం ఇస్తూ ఎమ్మెల్యే టికెట్ సాధించి ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

